![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -457 లో... అనామిక అన్న మాటలు కార్తిక్ గుర్తుకుచేసుకుని బాధపడుతుంటాడు. తనకి సంబంధించిన ఫోటోస్ అన్ని కూడా మంటల్లో వేసి కాల్చేస్తాడు. అది చూసిన కావ్య.. కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. నీ బాధని ఇలాగైనా తగ్గించుకోమని సలహా ఇస్తుంది. కళ్యాణ్ ని కావ్య భోజనానికి పిలవగా.. నేను రాను వదిన అని అంటాడు. నువ్వు మాకోసం ఇప్పుడు భోజనం చేయాలని కళ్యాణ్ ని కావ్య రిక్వెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంది.
ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటారు. కళ్యాణ్ డల్ గా ఉంటాడు. తినరా అని ధాన్యలక్ష్మి అంటుంది. నీ తప్పేం లేదని తెలిసింది కదరా.. ఇదంతా ఒక పీడకల అని మర్చిపోమని అపర్ణ అంటుంది. విడాకులు అయ్యాయని ఎవరు బాధపడడం లేదు. అలాంటిది నీ లైఫ్ లో లేకపోవడమే మంచిదని ఇందిరాదేవి అంటుంది. అనామిక దూరం అయిందని కళ్యాణ్ బాధపడడం లేదు. తన వల్ల అప్పు కి బ్యాడ్ నేమ్ వచ్చిందని బాధపడుతున్నాడని రుద్రాణి అనగానే.. అందరు తనపై విరుచుకుపడుతారు. నిజమేనా కళ్యాణ్ అని కళ్యాణ్ ని ధాన్యలక్ష్మి అడుగుతుంది. తప్పేంటి ఇన్నిరోజులు అని అని అనామిక వెళ్లిపోయింది. ఇక నువ్వు అంటున్నావా అని కళ్యాణ్ కోప్పడుతాడు. నీకు బుద్ది లేదా అని ధాన్యలక్ష్మిని తిడతాడు ప్రకాష్. ఇప్పుడు నేనేం అన్నాను.. అప్పు వల్లే కదా వాళ్ళు విడిపోయారని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పు వల్ల కదా నీ వల్లే.. అనామిక మొదట నా గురించి తప్పుగా మాట్లాడినప్పుడు నా కొడుకు అలాంటివాడు కాదని అంటే ఇంత దూరం వచ్చేది కాదని కళ్యాణ్ అనగానే.. నేనేం చేశాను వద్దన్న దాన్ని వెంటేసుకొని తిరిగావని ధాన్యలక్ష్మి అంటుంది. ఇక ఆపు.. తన పరువు తీసి తన ఇంటికి వెళ్లి వాళ్ళను అవమానించారు. తను ఒక ఆడపిల్ల.. అందరు నీ కూతురు హోటల్లో దొరికింది అంటే వాళ్లకు ఎలా ఉంటుంది. ఇంకొకసారి తన గురించి తప్పుగా మాట్లాడకని ధాన్యలక్ష్మికి కళ్యాణ్ చెప్పి వెళ్తాడు.
ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరికి కావ్య వచ్చి.. ఆవేశం తగ్గించుకో అప్పుకు సపోర్ట్ గా మేమ్ ఉన్నామని అంటుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వెళ్తుంది. వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడని రాజ్ అడుగుతాడు. కోపంగా ఉన్నాడు.. ఒకవేళ అప్పు సంతోషంగా ఉందని చెప్తే వాడు హ్యాపీగా ఉంటాడేమోనని రాజ్ అంటాడు. అప్పు హ్యాపీగా ఉండేలా చేయాలని అనుకుంటారు. ఆ తర్వాత రేపు అమ్మనాన్నల పెళ్లి రోజు అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో కావ్య, రాజ్ లు చీర తీసుకొని వచ్చి శుభాష్ కి ఇచ్చి అపర్ణకి ఇవ్వమంటారు. సుభాష్ చీర ఇవ్వగానే అపర్ణ తీసుకుంటుంది. దాంతో సుభాష్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |